కృష్ణ అలియాస్ కిట్టడు.అందరు తారలు కన్ను మూసాక మంచి గా మాట్లాడుకోవడం మీడియాకు అలవాటే.ఆహా .ఓహో అంటూ పొగిడేయడం మరి ఒక వ్యసనం లా తయారయ్యింది.మనిషి చనిపోయాక చెడు మాట్లాడితే అయన ఫ్యాన్స్ ఊరుకోరు కా మరి.ఎవరి భయం వారిది.సరే ఇప్పుడు కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటే అందరికి మంచిదే కదా.ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ని సినిమాల్లోనూ, రాజకీయాల్లోను ఎదురించి నిలబడ్డాడు.అయితే కృష్ణ పక్క తెలంగాణ వ్యతిరేఖి అని ఒప్పుకోవాల్సిందే.అయన ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రత్యేకమైన జై ఆంధ్ర ఉద్యమాలకు సపోర్ట్ చేసి నిరాహార దీక్షలు కూడా చే నట్టు అప్పట్లో వచ్చిన మీడియా కథనాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది.
ఇక తెలంగాణ వ్యతిరేకంగా ఎన్నో సార్లు బాహాటంగానే ఒప్పుకున్నాడు.ఇక మహాకవి శ్రీ శ్రీ లాంటి వ్యక్తి తెలంగాణాకి వ్యతిరేఖంగా అయన కవితలు, పద్యాలను రాస్తే అతడు నాకు బాగా ఇష్టమైన కవి అనేవాడు ఘట్టమనేని కృష్ణ.
అతడిని జై ఆంధ్ర ఉద్యమ విప్లవ ఇలవేల్పు అంటూ కొనియాడాడు.సరే ఈ తెలంగాణ గోల కాసేపు పక్కన పెడితే అయన స్టూడియో మాత్రం అన్ని కాలాల్లోనూ బాగానే విరాజిల్లింది.
చాల పెద్ద హీరోయిన్స్ ని కాంట్రాక్టుల పేరుతో బయట హీరోలకు పని చేయకుండా చేయడంలోనూ అయన బాగానే విజయం సాధించాడు.ఇక ఎన్టీఆర్ పెత్తనాన్ని భరించలేక సొంత సినిమాలు, బ్యానర్స్, స్టూడియోస్ కట్టాడు.
హాలీవుడ్, బాలీవుడ్ తో టాలీవుడ్ ని లింక్ చేసిన మొట్ట మొదటి వ్యక్తి కూడా కృష్ణ అని ఒప్పుకోవాల్సిందే.చాల మంది మాట్లాడినట్టు, బ్లడ్, బ్రీడ్ అనే మాటలు కృష్ణ ఏనాడూ మాట్లాడలేదు.కొంత మంది చదువును అంగడి సరుకులాగా అమ్ముతుంటే అయన దాన్ని వ్యతిరేకించాడు.మనం ఎన్ని మాట్లాడిన తెలుగు సినిమాను విస్తరించడం లో కృష్ణ పాత్ర ప్రముఖం.చనిపోయే దాకా మంచి ఫిజిక్ కూడా కలిగి ఉండటం ఆయనకే చెల్లింది.టాలీవుడ్ ని ఉద్దరించాను అంటూ ఏనాడూ అయన మాట్లాడలేదు.
చాల మంది చేయనివి కూడా చెప్పుకుంటూనే అయన మౌనంగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు.