హిందూ సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారిని ఊరేగించడం అందరికీ తెలిసిన విషయమే.అయితే అలా తీసుకెళ్లేటప్పుడు డప్పు, వాయిద్యాలు నడుమ ఘనంగా తుది వీడ్కోలు పలుకు తుంటారు.
అంతే కాకుండా ముందు చాలా మంది డ్యాన్స్ చేస్తుంటారు.అలాగే శవ యాత్రలో శవంపై మరమరాలు చల్లడం, డబ్బులు చల్లడం కూడా మనం చూస్తూ ఉంటాం.
అయితే అలా మరమరాలు, డబ్బులు ఎందుకు చల్లు తారో మాత్రం చాలా మందికి తెలియదు.అయితే ఇప్పుడు చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు చల్లాలో మనం తెలుసు కుందాం.
చనిపోయిన వారు ఎంత సంపాదించిన తాను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ల లేకుపోతున్నానని చెప్పేందుకే ఇలా చేస్తుంటారు.అయితే రేపు మీ పరిస్థితి కూడా అంతే కాబట్టి ధర్మంగా, న్యాయంగా జీవించండని ఈ విధంగా చేస్తుంటారు.
పది మందికి సాయం చేసి హాయిగా జీవించడమే జీవిత పరమార్థం అని, మీరైనా స్వార్థ చింతనలకు దూరంగా ఉండి జీవించమని చెప్తూ సూచన ప్రాయంగా ఇలా చెప్పిస్తుంటారు.అందుకే చనిపోయిన వారిని తీసుకెళ్లేటప్పుడు మధ్య మధ్యలో డబ్బులు చల్లుతుంటారు.
అంతే కాకుండా పోయిన వారి వెంట ఏమీ వెళ్లదని.శవ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వారి ప్రేమను సంపాదించడమే జీవితమని కూడా చెప్తుంటారు.
అందుకే బతికినన్నాళ్లూ.నలుగురితో ప్రేమగా, స్నేహంగా బతకాలి.
ఎవరి తోనూ గొడవలు పెట్టుకోకుండా, శత్రుత్వాలు పెంచు కోకూడదు.కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా సమాజమే తమ కుటుంబంగా భావిస్తూ.
అడిగిన వారికి లేదన కుండా సాయం చేయాలి.