చిత్రం శ్రీను దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఆ డైరెక్టర్ ఎవరంటే..?

డైరెక్టర్ తేజ తీసిన మొదటి సినిమా చిత్రం… ఈ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయినవాళ్లు చాలా మంది ఉన్నారు.వాళ్లలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ వంటి హీరో హీరోయిన్ లు ఉండగా చిత్రం శ్రీను లాంటి కమెడియన్ కూడా ఉన్నాడు.

 Who Is The Director Worked As An Assistant To The Chitram Seenu , Venu Tillu-TeluguStop.com

ఆయన ఈ సినిమాతో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈ సినిమా హిట్ అవ్వడం తో ఆయనకి వరుసగా సినిమాల్లో కమెడియన్ పాత్రలు వచ్చాయి.

దాంతో శ్రీను ఇండస్ట్రీ లో చాలా బిజీ కమెడియన్ గా మారిపోయాడు…అలా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల అందరి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న చిత్రం శ్రీను కి ఒక టైం లో కమెడియన్ వేణు (టిల్లు)( Venu tillu ) అసిస్టెంట్ గా చేసాడు.

 Who Is The Director Worked As An Assistant To The Chitram Seenu , Venu Tillu-TeluguStop.com

వేణు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఏం చేయాలో తెలియని టైములో చిత్రం శ్రీను దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయి ఆయన దగ్గరే వర్క్ చేసేవాడు అలా ఆయనతో పాటు షూటింగ్స్ కి పోయిన వేణు కూడా ఆ తరువాత జై సినిమాతో ఇండస్ట్రీ లోకి నటుడి గా ఏంటి ఇచ్చాడు.ఈ సినిమా సక్సెస్ కాకపోయినా కూడా నటుడిగా వేణు కి మంచి పేరు వచ్చింది.ఆ తరువాత మంచి సినిమాల్లో నటించి తక్కువ టైంలోనే కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.అందులో భాగంగానే ప్రభాస్ తో కలిసి మున్నా సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించి అందరిని మెప్పించాడు…

ఇక ప్రస్తుతం వేణు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేసిన బలగం అనే సినిమాకి( Balagam ) డైరెక్షన్ చేసి మంచి హిట్ అందుకున్నాడు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు అన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడి వేణు ఎక్కడికి ఎదిగాడు అంటూ తన గురించి తాను చెప్తూ ఇదంతా నేను నమ్మలేకపోతున్నా అంటూ మాట్లాడాడు.అందులో భాగంగానే ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు పడిన బాధలు ఎలా ఉండేవి అంటూ వాటి గురించి కూడా చాలా చక్కగా చెప్పాడు…మొత్తానికి అయితే వేణు డైరెక్టర్ గా ఒక మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి మరో కొత్త డైరెక్టర్ వచ్చాడు అని ప్రూవ్ చేసుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube