చండూరు మున్సిపాలిటీకి ఏమైందీ...?

నల్లగొండ జిల్లా:చండూరు మున్సిపాలిటీ( Chandur Municipality ) మురికి కంపు కొడుతోందని తొమ్మిదో వార్డ్ ఇందిరా కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.

కాలనీలో గత కొంత కాలంగా మోరీలు,చెత్త కుప్పలు శుభ్రం చేయక చెత్త చెదారం పేరుకుపోయి, డ్రైనేజీ వ్యవస్థ( Drainage system ) దుర్గంధం వెదజల్లుతూ,దోమల బెడద ఎక్కువై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనితో పాటు కాలనీలో కుక్కల( Dogs )బెడద కూడా తీవ్రంగా ఉందని,అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

What Happened To Chandur Municipality, Chandur Municipality, Drainage System ,

ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, కమిషనర్,కౌన్సిలర్లు స్పందించి ఇందిరా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాలనీకి చెందిన బూతురాజు వెంకన్న,సాయి,రమేష్, వెంకటాచారి,స్వామి,రాజు,అబ్దుల్లా తదితరులు కోరుతున్నారు.

పన్ను కట్టలేక ఏకంగా జైలుకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెదనాన్న..!
Advertisement

Latest Nalgonda News