రైతుల ఆందోళన వ్యవహారంపై కేంద్రమంత్రి అర్జున్ ముండా( Union Minister Arjun Munda ) స్పందించారు.రైతుల ప్రయోజనాలపై తాము శ్రద్ధ వహిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే రైతులతో( Farmers ) చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమస్య రాష్ట్రాలకు సంబంధించిందన్న అర్జున్ ముండా సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం కావాలని తెలిపారు.
అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఛలో ఢిల్లీ( Chalo Delhi ) పేరుతో ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది.అదేవిధంగా రహదార్లపై ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.