రహదారులపై ధాన్యం రాశులతో ఇబ్బంది పడుతున్నాం...!

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం( Kethepalli )లో ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లో ఐకెపి, పిఎసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రహదారులపై ఏర్పాటు చేయడం,రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకెళ్ళే క్రమంలోసరైన స్థలం లేక జాతీయ రహదారిపై ధాన్యం కుప్పలు పోయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు.

ప్రధానంగా మండలంలోని భీమారం గ్రామం నుండి ఉప్పలపహాడ్ పాత జాతీయ రహదారి వరకు 10 కి.

మీ.,తుంగతుర్తి చెరుకుపల్లి,కొండకిందిగూడెం రహదారిపై 7 కి.మీ., కేతేపల్లి,చీకటిగూడెం సర్వీస్ రోడ్లపై ఈ పరిస్థితి కనిపిస్తుంది.దీంతో ఈ రహదారులపై ప్రయాణాలు చేసేటప్పుడు ఎదురెదురుగా వాహనాలు వస్తే చాలా ఇబ్బంది అవుతుందని,మరోవైపు రైతులు ధాన్యం కుప్పల పక్కన రాళ్లు,కట్టెలు వేయడంతో రాత్రిపూట ప్రయాణంలో ప్రమాదాలు( Accidents )జరుగుతున్నాయని,గతంలో చెరుకుపల్లి,కొప్పోలు గ్రామాలకు చెందిన ప్రయాణికులు ప్రమాదాల బారిన పడిన ఉదంతాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We Are Having Trouble With Piles Of Grain On The Roads...!-రహదారుల

ప్రజా ప్రతినిధులు,అధికారులు ఐకెపి,పిఎసిఎస్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయాలని,రహదారులపై ధాన్యం నిల్వలు ఏర్పాటు చెయ్యొద్దని ప్రభుత్వం చెప్పినా సంబధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఇప్పటికైనా రహదారులపై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని ఆరబెట్టువాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News