ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలి:రైతు సంఘం పాల్వాయి రామిరెడ్డి

నల్లగొండ జిల్లా:సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పొలాలకు నీరందించి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం మండల కార్యదర్శి పాల్వాయి రామిరెడ్డి( Palvai Ramireddy ) అన్నారు.

సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సాగర్ ఎడమ కాలువ ( Sagar left canal )పరిధిలోని పొలాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వానకాలంలో కంటే వేసవిలో సాగు దిగుబడి తక్కువ శాతం ఉందని,ఆ పంటలు చిరుపొట్ట దశ నుండి వడ్లయ్యే పరిస్థితిలో ఉన్నాయని, ఒక నెల రోజుల్లో పంట పూర్తిగా చేతికొచ్చే అవకాశం ఉన్న సమయంలో నీళ్ళు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పని చేయడం లేదని,ఈ పరిస్థితి రైతాంగం పూర్తిగా నిరాశలో కూరుకుపోయారని అన్నారు.

Water Should Be Released To The Left Canal: Raitu Sangam Palvai Ramireddy , Nal

సాగర్ కాలవ ద్వారా 15 రోజుల పాటు నీటి విడుదల చేస్తే పంట పొలాలు చేతికొచ్చే అవకాశం ఉందని,వెంటనే నీటి విడుదల చేయాలని కోరారు.లేనిపక్షంలో ప్రభుత్వం పంటలు ఎండిపోయిన రైతాంగానికి ఎకరానికి రూ రూ.40 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, చల్లబట్ల ప్రణీత్ రెడ్డి,కోడి వెంకన్న,రైతులు( Farmers ) మట్టయ్య,మల్లయ్య,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News