మెదక్ జిల్లా,( Medak District ) దుబ్బాక మండలం, పరశురాం నగర్‌లో ఒక మైమరిపించే ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది.ఈ ప్రాంతానికి అడవిలో నుంచి వచ్చిన ఓ నెమలి( Peacock ) అక్కడి ప్రకృతి సౌందర్యాలకు పరవశించింది.
అందుకే పురి విప్పి మరీ నాట్యమాడింది.ఈ దృశ్యాన్ని ఒకరు కెమెరాలో రికార్డు చేశారు.
దానిని ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు “వావ్ దీనిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదు” అని కామెంట్ చేస్తున్నారు.
ఆ నెమలి ఈకలు చాలా అద్భుతంగా కనిపించాయని కామెంట్లు చేస్తున్నారు.ఇది చాలా పెద్ద నెమలి అని మరికొందరు అంటున్నారు.సాధారణంగా నెమళ్లు పురివిప్పి నాట్యమాడటం, అది కెమెరాలకు చిక్కడం చాలా అరుదు.అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకృతి దృశ్యం కనిపించడం విశేషంగా మారింది.మాములుగా మగ నెమళ్లు ఆడవాటిని ఆకర్షించేందుకు నాట్యం( Peacock Dance ) చేస్తుంటాయి.అలాగే ఫిట్నెస్ చూపించడానికి ఇవి డాన్స్ చేస్తాయి.
నెమళ్లు పురివిప్పి ఆడటానికి చాలా ఫిజికల్ ఎనర్జీ అవసరమవుతుంది.ఈ నాట్యం చేయడం ద్వారా ఇతర మగ నెమళ్లు కంటే తామే బలంగా ఉన్నామని కొన్ని నెమలి తెలియజేస్తుంటాయి.
ఇకపోతే నెమలి భారతదేశ జాతీయ పక్షి. ఇది అందం, గర్వం, రాయల్టీకి చిహ్నంగా కనిపిస్తుంది.హిందూ పురాణాలలో, నెమలి విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది.ఇది దేవుడి శక్తి, మహిమను సూచిస్తుంది.మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం వన్యప్రాణుల అభయారణ్యం చాలా జంతువులు, పక్షులకు నిలయంగా ఉంటుంది.వర్షాకాలంలో దీని నుంచి బయటికి వచ్చిన కొన్ని జంతువులు స్థానికులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి.