విడిపోతున్నామని హగ్ చేసుకొని ఎమోషనలవుతున్న డాక్టర్ బాబు, వంటలక్క.. వైరల్ వీడియో?

మామూలుగా కొన్ని పరిచయాలు అనేవి నడిచే ప్రయాణం బట్టి దగ్గరవుతూ ఉంటాయి.ఇక ఆ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులతో విడిపోలేని బంధం కూడా ఏర్పడుతుంది.

 Viral Video Of Dr Babu And Vanatalakka Are Hugging And Getting Emotional Because-TeluguStop.com

ఇక చేరుకోవాల్సిన గమ్యానికి వచ్చాక ఆ బంధం అనేది దూరం అవుతూ తట్టుకోలేని సందర్భాలు కూడా వస్తుంటాయి.ఇప్పుడు అటువంటిదే డాక్టర్ బాబు, వంటలక్కల మధ్య కూడా ఏర్పడింది.

ఈపాటికే అసలు విషయం ఏంటో అర్థం అవ్వచ్చు.స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

గత కొన్నేళ్ళ నుండి ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంది.సీరియల్ ప్రారంభం నుండి ఒకటే కథతో కొనసాగినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ పై తమ అభిమానాన్ని అస్సలు తగ్గించుకోలేకపోయారు.

ముఖ్యంగా ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు మాత్రం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంది.ఇక వీరిద్దరి కోసమే సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు.అలా వీరిద్దరికి ఈ సీరియల్ ద్వారా మంచి అభిమానం కూడా పెరిగింది.ఇక డాక్టర్ బాబు అసలు పేరు నిరూపమ్ పరిటాల.వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్.అలా ఈ సీరియల్ తో వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర చేసుకున్నారు.

ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరికి మంచి అభిమానం ఉంది.

అప్పుడప్పుడు వీరిద్దరూ రీల్ కపుల్స్ గా బుల్లితెరపై ప్రసారమయ్యే షోలల్లో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటారు.అంతేకాకుండా తమ పర్ఫామెన్స్ తో బాగా ఫిదా చేస్తూ ఉంటారు.

అయితే రీల్ కపుల్స్ గా వీళ్ళిద్దరూ గత కొన్నేళ్ల నుండి ఎంతలా క్లోజ్ అయ్యారో చూసాం.

ఇద్దరు కలిసి రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటారు.ఆ మధ్యనే వంటలక్క డాక్టర్ బాబు ఇంటికి వెళ్లి బాగా సందడి చేసిన సంగతి తెలిసిందే.అలా వీరిద్దరు బాగా క్లోజ్ అయ్యారు.

అయితే ఇక వీరిద్దరూ త్వరలో విడిపోనున్నారు.అదేనండోయ్ రీల్ కపుల్స్ గా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

త్వరలో కార్తీకదీపం సీరియల్ ముగియడానికి సిద్ధంగా ఉంది.ఇంత కాలానికి ఈ సీరియల్ బ్రేక్ పడటానికి సిద్ధంగా ఉంది.

మొత్తానికి కథ ఎండింగ్ కు వచ్చేసింది.అయితే ఈ సీరియల్ ముగియడానికి సిద్ధంగా ఉండటంతో తమ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

ఇక తాజాగా స్టార్ మా పరివారం కార్తీకదీపం సీరియల్ ముగియడానికి సిద్ధంగా ఉండటంవల్ల ఫేర్వెల్ గా ఈవెంట్ నిర్వహించగా దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఆ ప్రోమో లో డాక్టర్ బాబు, వంటలక్క లకు సన్మానం చేశారు.

ఆ తర్వాత ఇద్దరు తమ విడిపోతున్నాము అని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతున్నారు.ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube