వైరల్ వీడియో...ఈ బాలుడి నటనకు ఆస్కార్ కూడా తక్కువే...

చిన్నపిల్లలు ఏది చేసినా చూడ ముచ్చటగా అనిపిస్తుంది.ఎందుకంటే వారి మనసు నిష్కల్మషంగా ఉంటుంది.

 Kid Licking Lollipop During School Assembly, Little Boy Prayer, School Prayer, S-TeluguStop.com

కావున వారి మాటలు, చేష్టలు సైతం తమ స్వచ్చమైన మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారు.కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా తరువాత నవ్వుకోవడం ఖాయం.

ఇక స్కూళ్లలో చిన్నారులు చేసే పనులు చూస్తే మనం కడుపుబ్బా నవ్వుకుంటాం.ఏది ఏంటో సరిగ్గా వారికి తెలియదు కనుక వారికి ఏది అనిపిస్తే అది చేస్తుంటారు.

అది చూసే వారికి వింతగా అనిపిస్తుంది.చుట్టూ ఉన్న వారు తమ నవ్వును ఆపుకోలరనేది మాత్రం జగమెరిగిన సత్యం.

అయితే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఎవరూ మనల్ని చూస్తలేరని తెలిసాక కొంచెం ధైర్యంతో తాము చేయాల్సినది చేస్తుంటారు.మనం ఇటువంటి ఘటనలు మనం చాలా చూసి ఉన్నాం.

ఇక పిల్లలకు తినుబండారాలు అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇక తల్లిదండ్రులు చాక్లెట్ కాని, బిస్కెట్ కాని కొనివ్వకపోతే స్కూల్ కు వెళ్ళమని చెప్పి మారాం చేస్తుంటారు.

క తల్లిదండ్రులు కొనిచ్చిన చాక్లెట్ ను తింటూ అలా స్కూల్ సమయాన్ని గడిపేస్తుంటారు.అయితే ఓ విద్యార్ధి ప్రార్థన జరుగుతుండగా తన చేతిలో ఉన్న లాలీపాప్ ను తినకుండా ఆపుకోలేక ప్రార్థన జరగుతుండగానే అటు ప్రార్ధన చేస్తూనే ఇటు లాలీపాప్ ను తింటున్నాడు.

ఈ వ్యవహారాన్ని స్కూల్ లోని ఓ టీచర్ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేసింది.ఇక నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ బాలుని నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే నని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube