వైరల్: పెద్దమనసు అంటే ఇదే... అంధుడికి టిఫిన్ పెట్టి, నీళ్లు ఇచ్చిన చిన్నారిని చూడండి!

చిన్నపిల్లలు అనేవారు సాధారణంగా అల్లరి చిల్లరగా నిత్యం గొడవలు పడుతూ, కేరింతలు కొడుతూ అలా ఇంట్లో తిరుగుతూ వుంటారు.బయటకికెళ్లనా అంతే.

 Viral: This Is What Big-heartedness Is Look At The Little Girl Who Gave Tiffin A-TeluguStop.com

మరి కొంత మంది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటారు.వారికి చిన్నప్పటినుండే ఎదుటివారికి సాయం చేసే గుణం వుంటుంది.

సందర్బం వచ్చినప్పుడల్లా వారు తమ వుదార గుణాన్ని చాటుకుంటూ వుంటారు.ఎందుకంటే వారికి ఎటువంటి కల్మషం ఉండదు.

డబ్బున్నా లేకపోయినా, నిరుపేదలైనా, బిచ్చగాలైనా వారు బేధభావం చూపనే చూపరు.ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్నారి అంధుడైనా బిచ్చగాడికి సాయం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చూసిన వారు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.పిల్లలను ఇలాగే పెంచాలని, పాప తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తనకు చాలా మంచి అలవాట్లు నేర్పుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.వైరల్ అవుతున్న వీడియో స్కూల్ కు వెళ్లే ఓ చిన్నారి అంధుడైన ఓ బిచ్చగాడి దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వడం మనం చూడవచ్చు.

ఆ తరువాత ఆ బిచ్చగాడు పాపను ఏదో అడగగా పాప వెంటనే తన టిఫిన్ బాక్స్ తీసి అందులో ఉన్న స్నాక్స్( Snacks ) అతనికి ఇస్తుంది.అయితే వాటి కవర్ తీయడానికి అతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు.

దీనిని గమనించిన పాప వాటి కవర్ తీయడమే కాకుండా అతని నోట్లో కూడా తినమని పెడుతుంది.

ఆ తరువాత కూడా తన వాటర్ బాటిల్ తీసి అతనికి ఇచ్చేస్తుంది.తరువాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.మధ్యలో అక్కడ ఉన్న వారు పాపను ఏవో అడుగుతారు.

అయితే అక్కడ కొద్దిగా దూరంలో కారులో ఉన్న కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిందని అర్ధం అవుతోంది.ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు.

రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు.ఈ వీడియో చూసిన వారు పాపను దైవ దూతగా అభివర్ణిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube