సోషల్ మీడియా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేదేముంది, అందరికీ తెలిసిందే.స్మార్ట్ ఫోన్( Smart phone ) ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరింది.
దాంతో సోషల్ మీడియా హవా ఆటోమేటిక్ గా నడుస్తోంది.ఇక ఇక్కడ అనునిత్యం అనేక రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.
అందులోనూ ఫుడ్ కు సంబందించిన వీడియోల గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు.జనాలు స్ట్రీట్ ఫుడ్ ( Street food )ని ఎంతలా తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకే ఔత్సాహికులు రకరకాల కాంబినేషన్స్ తో అదిరిపోయే వంటలను తయారు చేస్తున్నారు.కొన్ని రుచులు జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం తీవ్రంగా కోపాన్ని తెప్పిస్తున్నాయి.

ఇక తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అవకాడో( Avocado ) తో అద్భుతమైన వంటను చేసి చూపించాడు.ఇక దాన్ని తింటూ కొందరు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఆ వీడియోకి సంబందించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అవకాడో గురించి అందరికీ తెలిసిందే.ఇక్కడ చాలామంది దానిని మార్నింగ్ దానిని తింటూ వుంటారు.ఎందుకంటే అది రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి.
అవకాడోల్లో ఆరోగ్యకర కొవ్వులు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు జీర్ణశక్తి మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది.

ఇక బరువును తగ్గాలని అనుకొనేవారు దీనిని డైట్ లో చేర్చుకుంటూ వుంటారు.అవకాడో తరచూ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood sugar levels ) అదుపులో ఉంటాయి అనడంలో సందేహమే లేదు.అందుకే రెస్టారెంట్లు సైతం తమ మెనూల్లో అవకాడో డిష్‌లను చేర్చాయి.స్ట్రీట్ ఫుడ్ వెండార్లు సైతం అవకాడో టోస్ట్‌ను విక్రయిస్తున్నారు.వడోదరకు చెందిన ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఎంతో శుచిగా, రుచిగా అవకాడో టోస్ట్‌ను స్ట్రీట్ ఫుడ్ విక్రేత రెడీ చేస్తుండటం పలువురిని ఆకట్టుకుంది.







