వైరల్: లోకల్ ట్రైన్‌లో చాక్లెట్లు అమ్ముకుంటున్న వృద్ధురాలిని మెచ్చుకుంటున్న నెటిజన్స్.. కారణం ఇదే!

అది ముంబై లోకల్ ట్రైన్‌.అక్కడ ఓ ముసలావిడ ప్రతిరోజూ చాక్లెట్లు విక్రయిస్తూ ఉంటుంది.చూడటానికి ఎంతో హుందాగా ఉంటుంది.కానీ ఆమె చాక్లెట్లు ఆ చోట విక్రయిస్తూ అనేకమందికి తారసపడుతూ ఉంటుంది.అయితే తాజాగా ఆమె అక్కడ టాక్ అఫ్ ది టౌన్ అయింది.అవును… తాజాగా ఆమెకి ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సూచింది.అయితే దానికి ఆమె నిరాకరించింది.దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.NGO వ్యవస్థాపకుడు హర్తీరత్ సింగ్ అహ్లువాలియా తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయం వెల్లడించారు.

 Viral Netizens Are Praising The Old Woman Selling Chocolates In The Local Trai-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, ముంబై లోకల్‌ ట్రైన్‌లో సదరు వృద్ధురాలు NGO వ్యవస్థాపకుడు హర్తీరత్ సింగ్ అహ్లువాలియాకి ఎదురయ్యిందట.

ఆమెను చూసిన అతడు వెంటనే ఆమెకి ఆర్ధిక సహాయం చేయాలని అనుకున్నాడట.అందుకోసం తనకు కొంత డబ్బును సాయంగా అందించారట.అయితే అందుకు ఆ వృద్ధురాలు నిరారకరించింది.తనకు డబ్బు సహాయం వద్దని చెప్పిందట.

బదులుగా వారు ఆమె విక్రయిస్తున్న అన్ని చాక్లెట్లను కొనుగోలు చేశారట.తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో వృద్ధురాలు చాక్లెట్లు అమ్ముతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.

నిజానికి మోనా ఎఫ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సదరు పోస్ట్ DCDW (ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్) చీఫ్ స్వాతి మలివాల్ మళ్లీ షేర్ చేశారు.ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల నుండి ప్రతి ఒక్కరూ వస్తువులను కొనుగోలు చేయాలని ఆమె కోరారు.పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వృద్ధురాలిని ఎంతగానో అభినందిస్తున్నారు.ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం అంటే ఇదే మరీ.! నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.హ్యాట్సాఫ్ అవ్వ అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజమే కదూ…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube