వీడియో: సెల్ఫీ కోసం రిస్క్.. అడవిదున్న ఛేజ్ చేస్తుంటే చనిపోయినట్లే యాక్టింగ్.. చివరికి?

చాలా మంది ప్రజలు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అదే పనిగా సెల్ఫీలు తీసుకుంటారు.కొందరైతే ప్రమాదకరమైన ప్రదేశాలలో లేదా పరిస్థితులలో ఫోటోలు దిగేందుకు ఇష్టపడతారు.

 Video: Risk For Selfie Chasing Bison Acting Like Dead In The End, Selfie , Dang-TeluguStop.com

ఇలాంటి కోవకు చెందిన చాలామంది ఇప్పటికే మృత్యవాతపడ్డారు.వ్యక్తులు సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కొండలపై నుంచి పడిపోవడం, ట్రైన్లు, కార్లు వారిని ఢీకొట్టడం లేదా జలపాతాల్లో పడిపోయి చనిపోవడం వంటి ఘటనలెన్నో ఇప్పటికే సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యాయి.

ఇక జంతువులతో ఫోటో దిగి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ముందు షో చేయొచ్చనే తపనతో కూడా కొందరు రిస్కు చేసి చివరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు.అయితే ఇటీవల ఒక మహిళ కూడా అడవి జంతువులు ఉన్న ప్రదేశానికి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకుంది.

అదే సమయంలో ఒక పెద్ద అడవిదున్న ఆమెపై ఎటాక్ చేసేందుకు దూసుకు వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.“ఇన్‌సైడ్ హిస్టరీ” అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ దీన్ని షేర్ చేసింది.

లోకల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, పబ్లిక్ పార్కు( Yellowstone National Park )లో ఓ మహిళ అడవి దున్నతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది.అయితే ఆ అడవి దున్నకు బాగా కోపం వచ్చి ఆమెను వెంబడించడం ప్రారంభించింది.ఈ మహిళతోటే ఉన్న మరొక మరో వ్యక్తి దాన్నుంచి పారిపోగలిగాడు.

కానీ సదరు మహిళ మాత్రం వేగంగా ఉరక లేకపోయింది.అడవి దున్న తనని ఈజీగా దొరకబుచ్చుకొని పొడిచి చంపేస్తుందని గ్రహించింది.

వెంటనే నెలపై పడుకొని చనిపోయినట్లే యాక్ట్ చేసింది.

అయితే ఆ అడవి దున్న( Bison ) సెకన్లలోనే మహిళ వద్దకు చేరుకుంది కానీ ఆమె కింద పడిపోవడాన్ని చూసి అది దాడి చేయలేదు.శవమై కింద పడినట్లు యాక్ట్ చేసిన ఆ మహిళపై దున్న దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు దూరం నుంచి వీడియోలు తీశారు.కొందరు వ్యక్తులు గేదెల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఆ దున్నపోతు ఆ స్త్రీ దగ్గరకు వెళ్లి, కాసేపు అక్కడే నిలబడి, ఆ తర్వాత ప్రజల అరుపులకు భయపడి దూరంగా పరుగెత్తింది.అందరూ

ఆ మహిళకు చావు

మూడిందనుకున్నారు కానీ అదృష్టం కొద్దీ ఆమె బతికిపోయింది.

ప్రజలు ఎల్లవేళలా దున్నల లాంటి అడవి జంతువులకు కనీసం 25 గజాల దూరంలో ఉండాలని నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది.కాగా ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube