వి : రాక్షసుడు వచ్చాడు, బాబోయ్‌ చూడలేక పోతున్నాం

నాని 25వ చిత్రం ‘వి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా సుధీర్‌బాబు నటిస్తున్నాడు.

 V Movie Latest Update-TeluguStop.com

విలన్‌గా నాని నటిస్తున్నాడు.నిన్న సుధీర్‌బాబును రక్షకుడిగా చూపిస్తూ ఆయన ఫొటోను విడుదల చేయడం జరిగింది.

ఆ పోస్టర్‌లో సుధీర్‌బాబు ఆట్టుకున్నాడు.పోలీస్‌గా సుధీర్‌బాబు లుక్‌ బాగుంది అంటూ ప్రశంసలు దక్కాయి.

అయితే నేడు విడుదలైన నాని రాక్షసుడి లుక్‌ మాత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంది.

Telugu Naani, Naani Mass, Naturalnani, Sudheerbabu, Latest, Latest Naani-Movie

ఇప్పటి వరకు నానిని క్యూట్‌ బాయ్‌గా.పక్కింటి కుర్రాడిగా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో రాక్షసుడిగా చూడమంటే మాత్రం ఒప్పుకోవడం లేదు.బాబోయ్‌ నానిని అలా చూడటం మా వల్ల కాదు అంటున్నారు.

ఆయన్ను అభిమానించే అమ్మాయిలు ముఖ్యంగా హీరో లాంటి నానిని రాక్షసుడిగా ఎలా చూడాలనుకుంటాం అంటూ ఫస్ట్‌లుక్‌కు కామెంట్స్‌ చేస్తున్నారు.నాని విలన్‌గా నటించడం ఏంటీ అంటూ మరికొందరు అంటున్నారు.

మొత్తానికి నాని రాక్షసుడి లుక్‌కు సోషల్‌ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.

Telugu Naani, Naani Mass, Naturalnani, Sudheerbabu, Latest, Latest Naani-Movie

నాని సహజ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.ఇప్పటి వరకు చేసిన 24 సినిమాలు కూడా హీరోగా నటించాడు.మొదటి సారి విలన్‌గా నటించి తన నటన సామర్థ్యంను మరింతగా ప్రేక్షకులకు చూపించాలని తాపత్రయ పడుతున్నాడు.

ఇక ఫస్ట్‌లుక్‌ పై నా స్పందన ఏంటీ అంటే.నాని ఏ పాత్ర చేసినా కూడా దానిలో విలీనం అయ్యి లీనం అయ్యి చేస్తాడు.

అలాగే ఈ పాత్రలో కూడా ఆయన సూపర్బ్‌గా సెట్‌ అయ్యాడు.ఆయన మీసాలు మరియు చేతిలో కత్తెర పట్టుకుని రక్తం కారుతున్నట్లుగా ఉన్న ఫోజ్‌ అదిరిపోయింది.

సినిమాలో ఆయన పాత్ర మరింత అదిరి పోవడం ఖాయం అనిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube