వాషింగ్టన్‌లో ఘనంగా ‘ వీర్ బల్ దివాస్‌’.. గురు గోవింద్ సింగ్‌ కుమారులకు నివాళులు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ తొలిసారిగా ‘వీర్ బల్ దివాస్’ను జరుపుకుంది.ఈ సందర్భంగా మత విశ్వాసాల కోసం ప్రాణ త్యాగం చేసిన 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు నివాళులర్పించారు.

 Us Indian American Community Observes Veer Bal Diwas Details, Us , Indian Americ-TeluguStop.com

గురు గోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్, బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు బలిదానం చేసిన దినాన్ని సిక్కులు ‘‘వీర్ బల్ దివాస్’’గా పాటిస్తారు.జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 26న వీర్ బల్ దివాస్‌గా పాటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా సోమవారం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన వీర్ బల్ దివాస్‌లో నలుగురు సాహిబ్జాదేల జీవితాలపై డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఛార్జ్ డి అఫైర్స్ శ్రీప్రియా రంగనాథన్ మాట్లాడుతూ.

పాకిస్తాన్‌లోని లాహోర్ సమీపంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను, గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించిందన్నారు.

Telugu Guru Nanak, Indianamerican, Sikhs, India Embassy, Veer Bal Diwas, Washing

గురునానక్ దేవ్ 550వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రంగనాథన్ ప్రస్తావించారు.గురు తేగ్ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుని ప్రత్యేక స్మారక నాణెం, తపాలా స్టాంపును ప్రధాని మోడీ విడుదల చేశారని శ్రీప్రియ గుర్తుచేశారు.అలాగే గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి గురు గ్రంథ్ సాహిబ్‌కు చెందిన మూడు పవిత్ర స్వరూప్స్‌ను తెప్పించినట్లు ఆమె తెలిపారు.కాగా.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం. 5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.

Telugu Guru Nanak, Indianamerican, Sikhs, India Embassy, Veer Bal Diwas, Washing

1469లో అవిభక్త భారతదేశం (ప్రస్తుత పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్)లోని ఒక హిందూ కుటుంబంలో గురునానక్ జన్మించారు.మెహతా కలు, మాతా త్రిపుర దంపతులు ఆయన తల్లిదండ్రులు.హిందువుగా జన్మించిన గురునానక్.

తత్వవేత్తగా మారి.అనంతరం సిక్కు మతాన్ని స్థాపించారు.

జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలిన గురు నానక్ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో 974 శ్లోకాలను వ్రాశారు.ఆయన అందించిన బోధనలు ‘‘గురు గ్రంథ్ సాహిబ్’’ (పవిత్ర పుస్తకం)లో ఉన్నాయి.

ఇది సిక్కులకు పవిత్ర గ్రంథం.గురు నానక్ తన జీవితం చివరి రోజుల్లో పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ జీవించారు.22 సెప్టెంబరు 1539లో 70వ ఏట పరమాత్మలో ఐక్యమయ్యారు.అందుకే సిక్కులకు కర్తార్‌పూర్‌ గురుద్వారా పవిత్ర క్షేత్రం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube