ఊర్వశి రౌతౌలా( Urvashi rautela, ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులను ఇరగదీసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువఅయ్యింది.ఈ పాట విడుదలైన తర్వాత ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్ లో కూడా స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది.అలా ఊర్వశీ ప్రస్తుతం తెలుగు ఐటం సాంగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.
తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది ఊర్వశి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆ వార్త విన్న అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం ఈమె రామ్ పోతినేని ( Ram pothineni )బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న స్కంధ మూవీలో ( skandha movie )కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ పాట కోసం ఊర్వశీ తీసుకున్న, అడిగిన రెమ్యూనరేషన్ మీద చర్చలు జరుగుతున్నాయి.
అయితే మూడు నిమిషాలు ఉండే ఆ పాట కోసం మూడు కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందని టాక్.బాస్ పార్టీ పాట కోసం రెండు కోట్లు తీసుకుందని సమాచారం.
స్కంధ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం మాత్రం మూడు కోట్లు తీసుకుందట.దీంతో నిమిషానికి ఒక కోటి తీసుకున్నట్టు అయిందట.ఆ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకునే మరో నటి లేదని సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే ఊర్వసి స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.