ప్రెగ్నెన్సీ ఒక ఎమోషనల్ జర్నీ... ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా కోడలు ఉపాసన( Upasana ) ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యి ఒక తల్లిగా కూతురిప ట్ల ఆలనా పాలన చూసుకుంటూ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాలకు బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 Upasana Apollo Hospitals Free Single Mother Children, Upasana, Pregnancy, Klin K-TeluguStop.com

ఇక ఉపాసన కుమార్తెకు క్లిన్ కారా ( Klin Kaara ) అనే నామకరణం కూడా చేశారు.ఇలా కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఇన్ని రోజులు ఇంటికి పరిమితమైనటువంటి ఉపాసన మొదటిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉపాసన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రెగ్నెన్సీ( Pregnancy ) గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమోషనల్ జర్నీ అని తెలిపారు.బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు.

అదే బిడ్డ తిరిగి కోలుకుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.

ఈ విధమైనటువంటి మధుర క్షణాలను పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నటువంటి డాక్టర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఈమె తెలియజేశారు.తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా చాలామంది నాకు ఈ విధమైనటువంటి సలహాలు ఇచ్చారని ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఉపాసన మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తన జీవితంలోకి తన కూతురు వచ్చిన తర్వాత తన జీవితమే ఎంతో సంతోషంగా మారిపోయిందని తన కూతురు ద్వారా తన ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను అంటూ ఉపాసన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube