ఆ రోజు ఆ మూడు మూవీస్ నుండి ట్రిపుల్ ట్రీట్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నాయి.వాటిల్లో పవన్ కళ్యాణ్ నుండి నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్టులలో ‘ఓజి’, ( OG Movie )’ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ వంటివి ఉన్నాయి.

 Triple Treat For Pawan Fans On A Special Day, Ustaad Bhagat Singh, Harish Shank-TeluguStop.com

అయితే వీటిలో ఏ సినిమా ముందు వస్తుందో ఏ సినిమా వెనుక వస్తుందో అని తెలియక ఫ్యాన్స్ తికమక పడుతున్నారు.ప్రజెంట్ పవన్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.

అలాగే మరోవైపు తన సినిమాల షూటింగ్స్ కూడా ఆపలేదు.ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.‘ఓజి’, ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) ‘హరిహర వీరమల్లు’ సినిమాల నుండి అప్డేట్స్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.కానీ పెద్దగా అప్డేట్ లను రివీల్ చెయ్యడం లేదు.

అయితే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ట్రీట్ ఫ్యాన్స్ కోసం రెడీ అవుతుందని టాక్.

Telugu Sujeeth, Harihara, Harish Shankar, Og, Pawan Kalyan, Tripletreat, Ustaadb

ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ట్రిపుల్ ట్రీట్ సిద్ధం అవుతుందట. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పుట్టిన రోజు కానుకగా ఓజి నుండి ఫస్ట్ గ్లింప్స్ రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.మరి మిగిలిన రెండు సినిమాల నుండి కూడా అప్డేట్ రానుందట.

ఉస్తాద్, వీరమల్లు నుండి పోస్టర్స్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండుగే పండుగ అని చెప్పాలి.

Telugu Sujeeth, Harihara, Harish Shankar, Og, Pawan Kalyan, Tripletreat, Ustaadb

వీటిలో ఓజి సినిమా( OG Movie )ను సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే 50 శాతం కంటే ఎక్కువగానే షూట్ పూర్తి చేసుకుంది.ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది.అలాగే క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు ఇప్పటికే 70 శాతం షూట్ పూర్తి అయ్యింది.మరి ఈ మూడు సినిమాలను పవన్ ఎలెక్షన్స్ లోపే పూర్తి చేయనున్నట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube