ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ మంజూరీకై మంత్రి ఉత్తమ్ సిఫారస్

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వం సూర్యాపేట జిల్లా( Suryapet District )లో కొత్తగా ఏర్పాటు చేసిన పాలకవీడు మండలంలో అత్యధికంగా గిరిజన జనాభా ఉంటుంది.

దీనితో ఇక్కడ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోతు మోతిలాల్ నాయక్ రాష్ట్ర మంత్రి,హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )ని కోరగా సంబంధిత శాఖను అభ్యర్థిస్తూ తన సిఫారసు లేఖను అందజేశారు.

శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ.శరత్ కు ఆ లేఖను అందజేసినట్లు మోతీలాల్ తెలిపారు.మంత్రి సిఫారస్ లేఖను అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సాధ్యమైనంత వరకు లేఖపై పరిశీలనచేసి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Tribal Welfare School Sanctions Minister Uttam Sifaras , Suryapet District ,M
పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్

Latest Suryapet News