విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన రైతు ఆత్మహత్యయత్నం...!

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora )లోని కెకె తండా గ్రామ పంచాయతీ పరిధిలోని బావసోనిబాయి తండాకు చెందిన గిరిజన రైతు రమవత్ బల్లు(44) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన విద్యుత్ అధికారులు రైతు( Farmer ) బోరు మీదుగా మెయిన్ లైన్ వేశారు.బోర్ పాయింట్ మీదుగా కాకుండా పక్క నుండి వేయాలని,బోర్ రిపేర్ అయినప్పుడు విద్యుత్ తీగలు( Electrical wires ) అడ్డువచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉందని బాధిత రైతు వేడుకున్నా విద్యుత్ ఏఈ పెడచెవిన పెట్టాడు.

దీనితోచేసేదిలేక రైతు పురుగులు మందు తాగినట్లు చెబుతున్నారు.

Advertisement

Latest Nalgonda News