నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు పడింది.

అతడిని నల్లగొండ నుండి మహబూబ్ నగర్ కు బదిలీ చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం.

హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న యు.

వెంకటేశ్వర్లును నల్గొండకు బదిలీ చేశారు.బదిలీ వేటు పడిన శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఇటీవల డిపిఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు ముకుమ్మడిగా రాష్ట్ర సమాచార కమిషనర్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీనితో డిపిఆర్ఓ శ్రీనివాస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా విధితమే.ఈ నేపథ్యంలోనే ఆయన బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest Nalgonda News