దేవర మూవీలో ఆ టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్.. కథను మలుపు తిప్పే రోల్ అంటూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) కొరటాల శివ కాంబో మూవీ దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకతలు కూడా ఎక్కువగానే ఉండనున్నాయని తెలుస్తోంది.

 Tollywood Young Hero Got Chance In Devara Movie Details Here Goes Viral , You-TeluguStop.com

సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి.

ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో ఒక యంగ్ హీరో( Young Hero ) కనిపిస్తారని ఆ హీరో రోల్ ను సైతం అద్భుతంగా డిజైన్ చేశారని సమాచారం అందుతోంది.దేవర మూవీలో నటించే ఈ యంగ్ హీరో ఎవరనే ప్రశ్నకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తారక్( Tarak ) ను అభిమానించే ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలు ఉన్నారు.ఆ హీరోలలో ఎవరో ఒకరు ఈ సినిమాలో నటించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారక్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటారో లేక లాభాల్లో వాటా తీసుకుంటారో తెలియాల్సి ఉంది.ఏప్రిల్ 5వ తేదీన 2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించనుందని తెలుస్తోంది.అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, ఇటు కొరటాల శివ ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube