మోడీ రాజ్యాంగ వ్యతిరేకి.. నిజమేనా ?

మోడీ సర్కార్( Modi government ) కు వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకం అవుతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీని గద్దె దించాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి.

 Opposition Against Modi , Modi, New Parliament Central Vista, Narendra Modi, Con-TeluguStop.com

అందువల్ల మోడీ సర్కార్ ను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు విపక్షాలు.రైతు చట్టాల విషయంలోనూ, విపక్ష నేతలపై కక్ష పూరిత వ్యవహారంలోనూ, ఆదాని, అంబానీ విషయంలోనూ ఇలా ప్రతిదాంట్లో కూడా మోడీసర్కార్ కు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నాయి విపక్షాలు.

ఇక తాజాగా నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్టా( New Parliament Central Vista ) ప్రారంభం విషయంలో కూడా మోడీ సర్కార్ ను ఇరకాటంలోకి నేట్టేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి.ఈ నెల 28న సెంట్రల్ విస్టాను నరేంద్ర మోడీ( Narendra Modi ) ఆద్వర్యంలో ప్రారంభోత్సవం జరగనుంది.

Telugu Aam Aadmi, Congress, Modi, Narendra Modi, Central Vista-Politics

అయితే మోడీ ప్రారంభించడాన్ని విపక్షాలు తప్పు బడుతున్నాయి.రాజ్యంగా ప్రథమ పౌరుడిగా నూతన పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించాల్సి ఉంటుందని అలా కాకుండా ప్రధాని ప్రారంభిస్తే అది రాజ్యంగ వ్యతిరేకం అవుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి.దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, ఆర్జేడి, సమాజ్ వాది పార్టీ.ఇలా దాదాపు 19 పార్టీలు మోడీకి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి.

దాంతో ఈ నూతన పార్లమెంట్ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.అయితే గతంలో ప్రధాని బాద్యతలు నిర్వర్తించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాలు చెఃశారని, ఇప్పుడు మోడీ చేయడంలో తప్పేముందని బీజేపీ నేతలు బదులిస్తున్నారు.

Telugu Aam Aadmi, Congress, Modi, Narendra Modi, Central Vista-Politics

దీంతో ప్రభుత్వ విపక్ష పార్టీల మద్య మాటల దాడి వాడి వేడిగా జరుగుతున్నాయి.కాగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ విషయంలో విపక్షాలు ఉద్దేశ పూర్వకంగానే వివాదం రేపుతున్నాయని, అసలు ఇది వివాదం చేయాల్సిన అంశం కానేకాదని బీజేపీ ( BJP )నేతలు చెబుతున్నా మాట.ప్రారంభోత్సవం ప్రధాని మోడీ చేతుల మీదుగానే జరుగుతుందని ఇందులో ఎలాంటి మార్పు ఉండదని కూడా స్పష్టం చేస్తోంది మోడీ సర్కార్.ఆయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు అయింది.

మరి దీనిపై అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది ? ఒకవేళ మోడీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే తరువాత బీజేపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.అనే విషయలు ఆసక్తికరంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube