నాటి తరం హీరోలకు నేటి తరం హీరోలకు ఎంతో తేడా ఉంది.నేటితరంలో హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు.
సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.కానీ నాటి తరం హీరోలు మాత్రం కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతగానో సత్తా చాటారు ఎంతోమంది.
ప్రత్యేకమైన ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం కూడా చేశారు.ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలులుగా కొనసాగారు ఎంతో మంది హీరోలు.
అయితే నేటి తరం హీరోలు రెమ్యూనరేషన్ తో పోల్చి చూస్తే మాత్రం ఒక అప్పటి తరం హీరోల రెమ్యునరేషన్ కాస్త తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.
అయితే ప్రస్తుత సమయంలో అయితే ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నదానిపై దాదాపు ప్రేక్షకులందరికీ క్లారిటీ ఉంది.
ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ సమయంలో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది చాలా మందికి తెలియదు.ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ఎన్టీఆర్ :
అప్పట్లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండేవారు.ఇక అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు కూడా ఎన్టీఆర్ వే కావడం గమనార్హం.ఇక ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక బడ్జెట్ కాస్త తక్కువ అయితే రెమ్యునరేషన్ కూడా తగ్గించే వారట ఎన్టీఆర్.
ఏఎన్ఆర్ :
అప్పట్లో స్టార్ హీరో గా కొనసాగిన అక్కినేని నాగేశ్వరరావు ఒక్కో సినిమాకి 10 లక్షల వరకు పారితోషికం తీసుకునే వారట ఏఎన్ఆర్.ఈయన సినిమాలు దాదాపు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట.ఇక తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు ఏడు లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసేవారట అక్కినేని నాగేశ్వరరావు.
కృష్ణ :
తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగిన కృష్ణ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక టాలీవుడ్ లో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించారు ఆయన.ఇక కృష్ణ ఒక్కో సినిమాకి 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక కృష్ణ నటించిన సినిమాలు 20 లక్షల బడ్జెట్ తో తెరకెక్కేవట.ఒకప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగిన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ లు మిగతా హీరోల కంటే భారీగానే రెమ్యూనరేషన్ తీసుకునేవారట.