వారసులు నటిస్తే తప్ప అప్పులు తీర్చలేని టాప్ నటుల కుటుంబాలు

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా చాలామంది గుర్తింపు పొంది ముందుకు సాగినప్పటికీ కొంతమంది హీరోల సినిమాలు మాత్రం సరిగా ఆడకపోవడంతో చాలా అప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో తెలీక సతమతమయ్యారు.అలాంటి సమయంలో వాళ్ల వారసులు వచ్చి వారికున్న అప్పులను తీర్చి వాళ్ళ ఫ్యామిలీ ని సేవ్ చేశారని చెప్పాలి అలాంటి వారు ఇండస్ట్రీలోఎవరెవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

 Tollywood Top Heros And Their Future Generations , Rajashekar, Krishna, Kamala H-TeluguStop.com
Telugu Amitha Bachhan, Arjun, Kamala Hasan, Krishna, Rajashekar, Tollywood-Telug

బాలీవుడ్ లో బిగ్ బీ గా గుర్తింపు పొందిన అమితాబచ్చన్ చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించారు ముఖ్యంగా షోలే లాంటి సినిమాతో ఇండియా వైస్ మంచి గుర్తింపును సాధించారు.అలాంటి అమితాబచ్చన్ తన వైవిధ్యమైన నటనతో మంచి గుర్తింపు సాధించాడు.అయితే తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ మాత్రం సినిమాలు చేసినప్పటికీ పెద్దగా రాణించలేదు అని చెప్పాలి.అయితే ఒక టైం లో అమితాబచ్చన్ ఫ్యామిలీ మొత్తం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్య రాయ్ సినిమాలు చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో అప్పులు మొత్తాన్ని తీర్చింది అని చెప్తుంటారు.

బాలీవుడ్ లోనే బిగ్ బి అని పిలిపించుకున్న అమితాబ్ లాంటి హీరో కి కూడా అప్పుల బాధలు తప్ప లేదు అంటే ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం అమితాబ్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Amitha Bachhan, Arjun, Kamala Hasan, Krishna, Rajashekar, Tollywood-Telug

హీరో అర్జున్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చాలా సినిమాలను చేసి హీరోగా తనకు ఎవరు సాటి లేరు అని నిరూపించుకున్నాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మేన్, ఒకే ఒక్కడు సినిమాలతో మంచి పేరుతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.అలాంటి అర్జున్ కూడా ఒక టైంలో అప్పుల పాలయ్యాడు.అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన కూతురు హీరోయిన్ గా వచ్చి తన అప్పులు మొత్తం తీర్చి వేసిందని చెప్పాలి.

Telugu Amitha Bachhan, Arjun, Kamala Hasan, Krishna, Rajashekar, Tollywood-Telug

ఇండస్ట్రీలో ఏ పాత్రనైనా అలవోకగా చేసే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసన్ అనే చెప్పాలి.కమల్ హాసన్ కెరియర్ లో సాగరసంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, దశావతారం లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనదైన నటనని చూపిస్తూ జనాలను అలరిస్తూ వచ్చారు.అలాంటి విలక్షణమైన నటుడికి కూడా బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో చాలా అప్పులు చేశారు వాటిని తీర్చడం ఆయన ఒక్కడి వల్ల కాకపోవడంతో తన కూతురు శృతి హాసన్ని కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఆవిడ చేసిన సినిమాలతో కమలహాసన్ అప్పులు మొత్తం తీరిపోయాయి.

ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ పక్కన సలార్ సినిమాలో నటిస్తుంది.

Telugu Amitha Bachhan, Arjun, Kamala Hasan, Krishna, Rajashekar, Tollywood-Telug

తెలుగులో వైవిధ్యమైన పాత్రలను చేసిన రాజశేఖర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం సినిమాతో మంచి గుర్తింపును సాధించారు.అనతికాలంలోనే పెద్ద హీరోగా ఎదిగి తన మార్కు నటనతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు.అయితే ఒకానొక టైంలో రాజశేఖర్ కి సినిమాలు లేక చేసిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో విపరీతమైన అప్పులకు గురి అయ్యాడు దాంతో తన కూతురు అయిన శివాత్మికని విజయ్ దేవరకొండ తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ చేసిన దొరసాని సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేశారు.

ఈ సినిమా ఆశించిన విజయం సాధించినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది.మొత్తానికి రాజశేఖర్ అప్పులను తీర్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube