టాలీవుడ్ కి అందని ద్రాక్షలు అందుతున్నాయి.. సినీ ప్రేమికుల సంతోషం

ఒకప్పుడు టాలీవుడ్‌ సినిమాలకు కనీసం పక్క రాష్ట్రం తమిళనాడు లో కూడా గుర్తింపు ఉండేది కాదు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

 Tollywood Movies Get Oscar And National Film Awards At A Time , Baahubali 2, Tol-TeluguStop.com

దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా ల గురించి మాట్లాడుకుంటున్నారు.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి.

బాహుబలి మొదలుకుని ఆ మధ్య విడుదల అయిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా లు రికార్డు స్థాయి లో వసూళ్లు నమోదు చేస్తున్నాయి.తెలుగు సినిమా వసూళ్లు వంద కోట్లు క్రాస్‌ అవుతాయా అనుకున్న రోజులు ఉన్నాయి.

ఇప్పుడు వరుసగా బాహుబలి 2( Baahubali 2 ) మరియు ఆర్‌ఆర్ఆర్‌ సినిమా లు వెయ్యి కోట్ల వసూళ్లు క్రాస్ అవ్వడం జరిగింది.

Telugu Allu Arjun, Naatu Naatu, National Awards, Oscar, Prabhas, Pushpa, Tollywo

అంతే కాకుండా ఆర్ఆర్‌ఆర్ సినిమా లోని నాటు నాటు పాట( Naatu Naatu Song )కు ఏకంగా ఆస్కార్‌ అవార్డ్‌ మరియు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డులు సొంతం అయ్యాయి.ఆ అవార్డు లు తెలుగు సినిమా కే కాదు హిందీ సినిమా లకు కూడా వస్తాయని ఏ ఒక్కరు ఊహించలేదు.కానీ నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం తో తెలుగు సినిమా అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.

Telugu Allu Arjun, Naatu Naatu, National Awards, Oscar, Prabhas, Pushpa, Tollywo

టాలీవుడ్ కి అందదు అనుకున్న ఆస్కార్‌ దక్కింది.ఇక జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతి సారి కూడా తెలుగు ప్రేక్షకులు నిటూర్చుతూనే ఉండేవారు.ప్రతి సంవత్సరం ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్నాం.ఇన్ని వందల కోట్ల వసూళ్లు వస్తూనే ఉన్నాయి.మరి ఎందుకు జాతీయ అవార్డు రావడం లేదని చాలా మంది బాధ పడ్డ సందర్భాలు ఉన్నాయి.వారంతా కూడా ఇప్పుడు సంతోషించే సమయం.

ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల పంట పండింది.ఎప్పుడూ లేనిది ఉత్తమ నటుడి గా అల్లు అర్జున్‌( Allu Arjun ) ఎంపిక అయ్యాడు.

అంతే కాకుండా పుష్ప మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లు పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది.ఇది తెలుగు సినీ ప్రేమికులకు సంతోషం కలిగించే విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube