లాఫింగ్ బుద్ధుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

This Type Of Laughing Buddha Keeping At Home Brings Luck And Happiness

చాలామంది సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే ఇంట్లో ప్రతి వస్తువు అమరికను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకుంటాను.

 This Type Of Laughing Buddha Keeping At Home Brings Luck And Happiness-TeluguStop.com

ఇకపోతే చైనా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉండటం ఎంతో శుభం అని భావిస్తారు.అయితే లాఫింగ్ బుద్ధుడి విగ్రహం ఎన్నో రూపాలలో మనకు లభిస్తుంది.

అయితే ఒక్కో రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టడం వల్ల ఒక్కో విధమైన ఫలితాలు కలుగుతాయి.మరి ఏ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొందాం.

 This Type Of Laughing Buddha Keeping At Home Brings Luck And Happiness-లాఫింగ్ బుద్ధుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల సంపద కలుగుతుందని చాలామంది భావిస్తారు.మన ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తూర్పువైపు పెట్టడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో పాటు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.

అయితే బంగారు సంచితో ఉన్నటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చుకుంటే ఈ విగ్రహాన్ని మనం లివింగ్ రూమ్ లో పెట్టుకోవాలి.ఇలాంటి విగ్రహం ఆనందాలకు అదృష్టలను తీసుకువస్తుంది.

అలాగే మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

ఇక ఆఫీసులలో తాబేలు పై ఉన్నటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడం వల్ల వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

అలాగే బెడ్ రూమ్ లో ధ్యానం చేస్తున్నటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడం వల్ల మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.అయితే ఈ విధమైనటువంటి లాఫింగ్ బుద్ధ ప్రతిమలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిలో కింద పెట్టకూడదు.

అలాగే బాత్రూం గోడలు దగ్గరగా ఈ విగ్రహాలను ఉంచకూడదు.ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే సంపద కలుగుతుందన్న నమ్మకంతో మనం ఈ విగ్రహాలను ఇంటిలో పెట్టుకుంటాము కనుక వీటిని ఎంతో గౌరవిస్తూ వీటిని కింద పెట్టకుండా చూసుకోవాలి.

#Luck #Fengshui Vastu #Buddha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube