ఎవరైనా గుడికి( Temple ) దేవునికి దండం పెట్టుకోవడానికి వచ్చి వారి సమస్యలను దేవుళ్ళకు తెలియజేసి తీర్చాలని కోరుకుంటారు.కాకపోతే ఓ వ్యక్తి మాత్రం దేవుడి భక్తుడిగా వచ్చి ఏకంగా అమ్మవారి మెడలోనే ఉన్న మంగళ సూత్రాన్ని కాజేసిన సంఘటన తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.మనం ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న దుఃఖం వచ్చిన మన కష్టసుఖాలను తెలుసుకోవడానికి గుడికి వెళ్లడం పరిపాటు.
కష్టం వచ్చిన సమయంలో మన కష్టాలని దేవుళ్లకు( God) చెప్పుకొని కోరికలు తీర్చాలని కోరుకొని అక్కడినుంచి వచ్చేస్తాము.
కాకపోతే., తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన ఏ కష్టం వచ్చిందేమో తెలియదు కానీ ఏకంగా గర్భగుడిలో అమ్మవారి మెడలో ఉన్న తాళిబొట్టును తీసుకొని వెళ్ళిపోయాడు.ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగరంలో ఉన్న సత్రంపాడు ప్రాంతంలో సౌభాగ్య లక్ష్మి ఆలయం( Sowbhagya Laxmi Temple )లో చోటుచేసుకుంది.
ఆలయంలోకి మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి భక్తుడిలా అమ్మవారి ముందు నమస్కారం చేసి.ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరు లేని సమయంలో సెకన్ల వ్యవధిలో గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి మెడలో ఉన్న తాళిబొట్టు( Mangalsutra )ను తెంచేసి దానిని తన జేబులో వేసుకొని అక్కడ నుంచి పరారయ్యారు.
దాంతో విషయం గ్రహించిన ఆలయ బృందం అక్కడే ఉన్న సీసీ కెమెరా( CC Camera )లో రికార్డ్ అయిన దృశ్యాలని చూడడంతో అవాక్కయ్యారు.దాంతో చేసేది ఏమి లేక ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.దాంతో పోలీసులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.