వీడియో వైరల్: ఒకే చోటికి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. చివరికి..?!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) పుణ్యమా అంటే ప్రతి విషయం ఇట్టే తెలిసిపోతుంది.ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో ఆ విషయం కాస్త ఇట్లే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది.

ఇందులో భాగంగానే అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.అప్పుడప్పుడు కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ప్రపంచంలో ఎక్కడైనా సరే అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలలోకి తరచుగా.ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు లాంటి జంతువులు వస్తుండడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.ఒకసారి అటవీ ప్రాంతం( Forest ) నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చి అవి భయపడడమే కాకుండా.ప్రజలు కూడా ఆ జంతువులు మనల్ని ఏం చేస్తాయా అని భయబ్రాంతులకు లోనవుతుంటారు.

ఇకపోతే తాజాగా తమిళనాడులోని ఊటీ పరిధిలో ఉన్న ఎల్లనల్లి కైకట్టి గ్రామం( Yellanalli Kaikatti Village )లో ఓ సంఘటన చోటుచేసుకుంది.

గ్రామంలో ఓ ఇంటి వద్ద బయట ప్రాంతంలో రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత మొదటగా ఓ చిరుత పులి( Tiger ) ఇంటి ఆవరణలోకి వచ్చి అక్కడ దానికి ఏ ఆహారం దొరకకపోవడంతో అక్కడ నుంచి గేటు దూకి వెళ్లిపోయింది.అలా వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఓ ఎలుగుబంటి( Bear ) కూడా వచ్చింది.దానికి కూడా అక్కడ ఏమి లభించకపోవడంతో.

అక్కడే ఉన్న ప్రహరీ గోడను దూకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఒకవేళ ఈ జంతువులు ఉదయం పూట వచ్చి ఉంటే మాత్రం ఏదో ఒక ప్రాణికి హాని కలిగేది కచ్చితంగా.

అయితే చిరుత, ఎలుగుబంటి వచ్చిన సమయంలో అక్కడే ఉన్న సీసీకెమెరా( CC Camera )లో రికార్డు అయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube