ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్‌లు, ఉద్యోగాల్లో కోతలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.దీంతో తమ ఉద్యోగాలు వుంటాయో ఊడుతాయోనని సగటు ఉద్యోగి భయపడుతున్నారు.
తాజాగా అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోన్న ‘‘ EXL Service ’’ 800 మంది ఉద్యోగాలను తొలగించింది.అది కంపెనీ వర్క్ ఫోర్స్‌లో దాదాపుగా 2 శాతం.
ఉత్పాదక కృత్రిమ మేథస్సు ‘‘ enerative artificial intelligence (GenAI)’’ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తన కార్యకలాపాలను ఈ సంస్థ పునర్నిర్మిస్తోంది.ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఉద్యోగాల్లో కోత విధించినట్లుగా తెలిపింది.
ఈ నిర్ణయం ప్రధానంగా భారత్, అమెరికాలలోని( India , America ) డేటా అనలిటిక్స్, డిజిటల్ కార్యకలాపాలలో జూనియర్ సిబ్బందిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.‘ EXL Service ’’కు ప్రపంచవ్యాప్తంగా 55,000 మంది ఉద్యోగులు వున్నారు.
అదే సమయంలో ఈ సంస్థ అధునాతన డేటా, ఏఐ, ఉత్పాదక నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్‌ను నియమిస్తోంది.

కంపెనీ మేనేజ్‌మెంట్‌లో చోటు చేసుకున్న మార్పులు కూడా ఉద్యోగాల కోతలపై ప్రభావం చూపి వుండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.EXL Service సీఈవోగా వున్న రోహిత్ కపూర్ ( Rohit Kapoor )ఇటీవల బోర్డు చైర్‌గా పదోన్నతి పొందారు.సీనియర్ లీడర్లు వికాస్ భల్లా, వివేక్ జైట్లీలు( Vikas Bhalla, Vivek Jaitley ) ఏఐ నేతృత్వంలోని పరిష్కారాలను సమగ్రపరచడం వంటి పాత్రలను పోషిస్తున్నారు.
ఈ మార్పు సంస్థ కొత్త దిశను ప్రతిబింబిస్తుంది.కంపెనీ ప్రతినిధి ప్రకారం.పునర్నిర్మాణంలో ఇప్పటికే వున్న పాత్రలను తిరిగి మూల్యాంకనం చేయడం, డేటా, ఏఐ నైపుణ్యం కలిగిన అత్యుత్తమ ప్రతిభను తీసుకురావడం వంటివి వున్నాయన్నారు.తమ క్లయింట్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా తమ నిర్ణయాలు వుంటాయని ఆయన వెల్లడించారు.

EXL Service .డేటా అనలిటిక్స్, డిజిటల్ సొల్యూషన్స్ తదితర సేవలను అందిస్తుంది.2020 చివరి నుంచి 22 వేల మందిని ఈ సంస్థ నియమించుకుంది.అయితే విపరీతంగా ఖర్చులు పెరగగా.
కొన్ని డీల్స్ ముగిశాయి.ఇటీవల ముగిసిన త్రైమాసికంలో ఈఎక్స్ఎల్ అనలిటిక్స్ విభాగం 182 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది.ఇది ఇంతకుముందుతో పోలిస్తే 6.2 శాతం పెరిగింది.







