భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి క్రికెట్ అభిమాన దేశాల నుంచి పెద్ద సంఖ్యలో డయాస్పోరా జనాభా వుండటంతో అమెరికాలో( America ) టూరిజం, హాస్పిటాలిటీ డొమైన్ కొత్త రూపాన్ని సృష్టించినట్లుగా కనిపిస్తోంది.బీహార్‌కు చెందిన భారతీయ అమెరికన్ జంట స్థాపించిన ‘‘క్రికెట్ బస్టర్ ’’( Cricketbuster ) అధికారిక మ్యాచ్ టిక్కెట్‌లు, హోటళ్లు, విమానాలతో కూడిన ప్యాకేజ్‌ను అందిస్తోంది.
తద్వారా భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో, క్రికెట్ ఆడే దేశాలలో క్రికెట్ మానియాను( Cricket Mania ) క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.క్రికెట్ బస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విన్నీకుమార్( Vinny Kumar ) జాతీయ మీడియా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.
తాము ఇక్కడ స్పోర్ట్స్ ఈ కామర్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అనుమతి పొందామని కుమార్ అన్నారు.ప్యాకేజీలను విక్రయించే హక్కు మాకు వుందని.టికెట్లు కూడా ప్యాకేజీలో చేర్చామని ఆయన వెల్లడించారు.
ఇది కేవలం టికెట్ కొనడం ,స్టేడియంకు రావడం మాత్రమే కాదని.ఉదాహరణకు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం న్యూయార్క్‌కు వెళ్తున్నారనుకోండి.
మీరు ఏ హోటల్‌లో బస చేయాలి, స్టేడియం నుంచి ఎంత దూరంలో వున్నారు.ఇతర సౌకర్యాలు కోరుకుంటున్నారో మీకు తెలియదని విన్నీ కుమార్ అన్నారు.
ఇలాంటి వారి కోసం తమ వద్ద ప్యాకేజ్‌లు వున్నాయని.మ్యాచ్ టికెట్( Match Ticket ) కలిగి వుంటే.సరైన హోటల్, రవాణా వంటి వాటిని కనుగొనడంలో సహాయం చేస్తామని చెప్పారు.విన్నీ కుమార్ ఇటీవల ఓర్లాండోలో జరిగిన ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చారు.
విన్నీ కుమార్ తన భార్య రష్మీ కుమార్‌తో కలిసి 2019లో ఈ కంపెనీని స్థాపించారు.గతేడాది భారత్‌లో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌తో ప్రారంభించి.క్రికెట్ బస్టర్ ఐసీసీకి( ICC ) అధికారిక ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ (ఓటీఏ)గా నిలిచింది.కంపెనీని ప్రారంభించిన కొత్తలోనే కోవిడ్ మహమ్మారి విజృంభించింది.
అయితే 2021లో క్రికెట్ బస్టర్ దుబాయ్‌లో తొలి టొర్నమెంట్‌కు హక్కులు పొందింది.అమెరికా నుంచి యూఏఈకి దాదాపు 500 మంది అభిమానులను తీసుకెళ్లింది.
ఈ ఏడాది అమెరికాలో టీ20 క్రికెట్ ప్రపంచకప్( T20 World Cup ) వుంది.అమెరికాలోని చాలా మంది క్రికెట్ అభిమానులకు ఇది చారిత్రాత్మక ఘట్టం.అమెరికాకు ఇది గేమ్ ఛేంజర్ లాంటిదని నిపుణులు అభివర్ణిస్తున్నారు.ప్రస్తుతం ఎన్నో మోసాలు జరుగుతున్న వేళ.అధికారిక మ్యాచ్ టికెట్‌లను పొందడానికి తాము వారికి సహాయం చేస్తున్నామని కుమార్ పేర్కొన్నారు.క్రికెట్ అభిమానులందరికీ సరైన ఛానెల్ నుంచి టికెట్లు వచ్చేలా చూసేందుకు ఐసీసీ మమ్మల్ని నియమించిందని ఆయన తెలిపారు.
అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం తనకు, తనలాంటి ఎంతో మంది అభిమానులకు ఒక కల అని విన్నీ కుమార్ అన్నారు.మనకు కేవలం భారత్ నుంచి మాత్రమే అభిమానులు లేరని.
పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, శ్రీలంక నుంచి కూడా అభిమానులు వున్నారని విన్నీ కుమార్ పేర్కొన్నారు.