అమ్మవారి పంచలోహ విగ్రహం చోరీ

నల్గొండ జిల్లా:మర్రిగూడెం మండలం అంతంపేట గ్రామంలో విలువైన అమ్మవారి పంచలోహ విగ్రహం శనివారం రాత్రి చోరీకి గురైంది.9 నెలల క్రితం గ్రామ శివారులోని పాత ముత్యాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి పంచలోహ విగ్రహం లభించింది.

గ్రామస్తుల అందరి సమక్షంలో గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గ్రామ పెద్దలు భద్రపరిచారు.

ఈ పంచలోహ విగ్రహం విలువ సుమారు కోటి యాభై నుండి రెండు కోట్ల వరకు ఉంటుందని గ్రామస్తుల అంచనా.ఆ విగ్రహం ఆదివారం రోజు వెళ్లి చూడగా విగ్రహం కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విగ్రహం ఉగాది పండుగ రోజు రాత్రి పోవడం గ్రామంలో కలకలం రేపింది.ఆలయ తాళాలు ఎవరి వద్ద ఉంటే వారే బాధ్యత వహించాలని గ్రామస్తులు వాదిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠా అరెస్ట్...!

Latest Nalgonda News