యమపాశాలుగా మారుతున్న వాహనాలు

నల్లగొండ జిల్లా:జిల్లాలోని నిడమనూరు మండలంలో ట్రాక్టర్లు ఢీకొని ఎంతోమంది వాహనదారులు విగత జీవులుగా మారుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.

ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్ లేకపోవడంతో ( Tractor trolley )ట్రాక్టర్లు వాహనదారులకు దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని,ట్రాక్టర్లే కాకుండా ఫోర్ వీలర్స్, డీసీఎం వ్యాన్లు,లారీలు తదితర వాహనాలు రేడియం స్టిక్కర్ లేకపోవడంతో రాత్రిపూట లైట్ కు కనిపించడం లేదని,రోడ్డు పక్కన పార్కు చేసిన వాహనాలు కనిపించక అనేక ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులుచూద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.ట్రాక్టర్లకు ట్రాలీలకు,వాహనాలకు రేడియం స్టిక్కర్( Radium sticker ) అంటించినట్లయితే ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు స్పందించి అన్ని రకాల వాహనాలకు కచ్చితంగా రేడియం స్టిక్కర్లు ఉండేలా చూడాలని కోరుతున్నారు.అంతేకాకుండా గ్రామాలలో ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు లైసెన్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు చొరవ తీసుకొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News