బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ ఒకరు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) నాయినివాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) కు చెందిన ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళుతూ పెద్దవూర మండలం నాయినివాని కుంట స్టేజీ వద్దకు రాగానే ట్రాక్టర్ ఢీ కొట్టడంతో బైక్ పై వున్న ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్ లోనే మృతి చెందగా,మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

The Tractor Hit The Bike, Killing One And Seriously Injuring Another , Tractor,

ఘటనా స్టలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను,ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు‌.

Advertisement

Latest Nalgonda News