తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.నరసింహస్వామి ఆలయం దగ్గర ఫుట్ పాత్ పై ఎలుగుబంటి కనిపించింది.
ఆలయం దగ్గర రాత్రి ఒంటి గంట సమయంలో ఎలుగుబంటిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.చాలాసేపు నడక మార్గంలోనే ఎలుగుబంటి సంచరించినట్లు తెలుస్తోంది.
తిరుమల నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచార నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల చిరుతలు దాడులు చోటు చేసుకున్న తరుణంలో అటుగా వెళ్లాలంటే జంకుతున్నారు.
జంతువుల సంచారం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ అధికారులు భక్తుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.