వర్షాలు వచ్చేస్తున్నాయ్...

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రేపు భద్రాద్రి,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,రంగారెడ్డి,వికారాబాద్‌,సంగారెడ్డి,సిద్దిపేట,మహబూబ్‌నగర్‌,నాగర్‌ కర్నూల్‌, వనపర్తి,నారాయణపేట,గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉరుములు,మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయన్నారు.అటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని,ఇప్పటికే కేరళ,కర్ణాటక,తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది.

Advertisement

Latest Nalgonda News