పోలింగ్ జరిగే విధానం...!

నల్లగొండ జిల్లా:ఓటరు తన ఓటర్ కార్డు( Voter card )తో సహా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ స్లిప్ ను, ఓటర్ కి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ను తనకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.ఒకవేళ మీకు ఓటర్ స్లిప్పు అందకపోతే, ఈ లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు https://electoralsearch.

eci.gov.in/.

పోలింగ్ తేదీ రోజు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు ఎలా వేయాలో చూద్దాం రండి. మొదటగా మీరు మీతో పాటు తెచ్చిన డాక్యుమెంట్లను పోలింగ్ అధికారులకి చూపించాల్సి ఉంటుంది.

మీ డాక్యుమెంట్లను వారు ధ్రువీకరించాక మీ వేలుకు ఇంకును వేస్తారు.ఆ తర్వాత మిమ్మల్ని పోలింగ్ బూత్ లోకి వెళ్ళమంటారు.

పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత మీ అభ్యర్థులతో కూడిన పేరుతో సహా గుర్తులతో కూడిన బ్యాలెట్ ఉంటుంది.మీరు ఏ అభ్యర్థి కైతే ఓటు వేయాలో ఆ అభ్యర్థి పక్కనే బటన్ నొక్కాల్సి ఉంటుంది.

Advertisement

మీరు బటన్ నొక్కిన వెంటనే టీ.మంటూ సౌండ్ వస్తుంది.మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరును,గుర్తును వీవీప్యాట్ మెషిన్ లో డిస్ప్లే అవుతుంది.

డిస్ప్లే అయిన కాగితాన్ని వీవీప్యాట్ తనలోనే( VVPAT ) భద్రపరుచుకుంటుంది.మీరు వేసిన ఓటు డిజిటల్ రూపంలో మరో కంట్రోల్ యూనిట్ మిషన్లో భద్రపరచబడుతుంది.

ఇలా ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఓటును నమోదు చేయబడుతుంది.పోలింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల అధికారులు.

వీవీప్యాట్ ను కంట్రోల్ యూనిట్ను జాగ్రత్తగా సీల్ చేసి,స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు.సీల్ చేసిన మిషన్లను తిరిగి లెక్కింపు రోజే తెరుస్తారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?

ఓట్లను లెక్కించేముందు మెషిన్లకున్న సీల్ను వెరిఫై చేస్తారు.కేంద్ర ఎన్నికల ఆఫీసర్స్ ఆధ్వర్యంలో సీల్ ను బ్రేక్ చేసి ఓట్లను లెక్కిస్తారు.

Advertisement

Latest Nalgonda News