ఆహా’లో సరికొత్త ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ‘అల్లుడుగారు’.. అక్టోబర్ 29న తొలి ఎపిసోడ్ ప్రసారం..

100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా.తెలుగు లోగిళ్లలో డిజిటల్‌ స్పేస్‌లో అచ్చమైన వినోదానికి అసలు సిసలు కేరాఫ్‌.ఇప్పుడు ఆహా కొత్త వెబ్‌ సీరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది.ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ డ్రామాకు అల్లుడు గారు అనే టైటిల్‌ని ఖరారుచేశారు.అభిజీత్ పూండ్ల, ధన్య బాలకృష్ణ, వై కాశీ విశ్వనాథ్, సుధ, షాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు.లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి ఫేమ్‌ జయంత్‌ గాలి దర్శకత్వం వహించారు.

 The Latest Feel-good Web Series On Aaha Is 'alludugaru' .. The First Episode Air-TeluguStop.com

తమడ మీడియా నిర్మించింది.మోడ్రన్‌ డే రిలేషన్‌షిప్స్, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి పర్ఫెక్ట్ గా ఫోకస్‌ చేసి తెరకెక్కించారు.

షోని బ్రూ ప్రెజెంటర్‌గా స్పాన్సర్‌ చేస్తోంది.మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 29 న విడుదల కానుంది.

అల్లుడు గారు కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ స్టోరీ.కొత్త పెళ్లైన జంట అజయ్‌ (అభిజిత్‌ పూండ్ల), అమూల్య (ధన్య బాలకృష్ణ) చుట్టూ తిరుగుతుంది.సాంప్రదాయక కుటుంబంలో తన అత్తమామలు నళిని (సుధ), అశోక్ (వై కాశి విశ్వనాథ్) తో ఉండవలసి వచ్చిన అజయ్ పరిస్థితిని సరదాగా తెరకెక్కించారు.మొదట్లో వాళ్లతో ఇమడలేకపోయినప్పటికీ, వాళ్ల అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించడానికి అజయ్‌ చాలానే కష్టపడతాడు.

అతని ఆలోచనలు, అభిరుచులు ఇంకో రకంగా ఉంటాయి.అయినా పెద్దల మధ్య ఉండాల్సి వచ్చినప్పుడు అతను ప్రవర్తించే విధానం కడుపుబ్బా నవ్విస్తుంది.

అతని కేరక్టర్‌తో చాలా మంది సహానుభూతి చెందుతారు.

Telugu Ajith, Alludugaru, Amulaya, Web, Kashi Viswanadh, October, Sudha, Tollywo

రకరకాల జోనర్లలో హిట్‌ షోలను తమ ప్రేక్షకులకు అందించడమే అలవాటుగా పెట్టుకుంది ఆహా.తరగతి గదిలో, కుడి ఎడమైతే, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ.ఇలా ప్రతి జోనర్‌లోనూ ఓ హిట్‌ షోని రిజిస్టర్‌ చేసింది ఆహా.ఈ కోవలో అల్లుడుగారు కూడా కచ్చితంగా హిట్‌ సీరీస్‌గా పేరు తెచ్చుకుంటుంది.మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో జరిగే కథ, బంధాలు, అనుబంధాలకు సంబంధించిన కంటెంట్‌ కావడంతో కచ్చితంగా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.

బ్రూతో అసోసియేట్‌ కావడం ఆనందంగా ఉంది.భవిష్యత్తులోనూ వారితో అసోసియేట్‌ కావాలనుకుంటున్నా” అని ఆహా సీఈఓ అజిత్‌ ఠాకూర్‌ తెలిపారు.రీజినల్‌ ఓటీటీ ప్లేయర్‌ అయినప్పటికీ, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన వినోదాన్ని ప్రాంతీయ భాషలో అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.బ్రాండ్లతో మా అసోసియేషన్‌ వల్ల మరింత ఎంగేజింగ్‌ కంటెంట్‌ని క్రియేట్‌ చేయడానికి వీలవుతుంది.

బ్రూతో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.దినదినాభివృద్ధి చెందుతున్న మా ప్రేక్షకులకు, అభిమానులకు మరిన్ని ప్రత్యేకమైన కథనాలు అందించడానికి ఈ అసోసియేషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని ఆహా నాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ రెవెన్యూ హెడ్‌ నితిన్‌ బర్మన్‌ తెలిపారు.

అంతులేని ప్రేమ, అంతులేని వినోదం అనే నినాదంతో తెలుగు లోగిళ్లలో అంతులేని ఆనందాన్ని నింపుతున్న ఆహా ఈ ఏడాది తమ ప్రేక్షకుల కోసం క్రాక్‌, లెవన్త్ హవర్‌, జాంబీ రెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌, నీడ, కాలా, ఆహా భోజనంబు, ఒన్‌, సూపర్‌డీలక్స్, చతుర్ముఖం, కుడి ఎడమైతే, తరగతి గదిదాటి, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, మహా గణేశ, పరిణయం, ఒరే బామ్మర్ది, కోల్డ్ కేస్‌, ఇచట వాహనములు నిలపరాదు వంటి సినిమాలు, హిట్‌ షోస్‌ని ప్రెజెంట్‌ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube