ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలు వాయిదా

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలు వాయిదా పడింది.ఈ మేరకు రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 The Implementation Of The Ban On Plastic Flexi In Ap Has Been Postponed-TeluguStop.com

ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు వాయిదా వేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయనున్నామని వెల్లడించింది.

అయితే, ఫ్లెక్సీలపై నిషేధం అమలుకు ఒక్క రోజు ముందుగా కీలక నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ … రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్లాస్టిక్ బదులుగా వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు.సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లుగా గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube