ఇంటిపైకి దూసుకెళ్లిన కారు...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda ) బట్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం మాధగోని వెంకటయ్య ఇంట్లోకి కాదు దూసుకెళ్ళిందని మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.

మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన లపంగి యశ్వంత్ కారులో నాంపల్లికి వెళుతూ అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బట్లపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిందని,ఈ ప్రమాదంలో రెండు బైకులు,రేకులు,రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని,ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

The Car Crashed Into The House...!-ఇంటిపైకి దూసుకె�

Latest Nalgonda News