ఏపీలో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనిని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.కాగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 అనే టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు.
అయితే వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జగనన్నకు చెబుదాం ద్వారా టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి తెలిపాలని సూచించారు.కాగా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు.
సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగనుంది.