ఆ ఊరిని దేశ భక్తుల గ్రామం అంటారు.. ఎందుకో తెలుసా?

అవును.మీరు విన్నది నిజమే.

 That Town Is Called The Village Of Devotees Of The Country Do You Know Why , Vil-TeluguStop.com

ఆ ఊరిని దేశ భక్తుల గ్రామం అని కొనియాడుతారు.దాని వెనకాల పెద్ద కధే వుంది.

అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిలో దేశానికి సేవ చేయాలన్న తపన మెండుగా ఉంటుంది.అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం ఎక్కడుందో తెలియాలంటే నిజామాబాద్‌ వెళ్లసిందే.

తరతరాలుగా అక్కడివారు ఆర్మీలో సేవలు చేస్తున్నారు. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే.ఏటా కనీసం 10 మంది బోర్డర్‌కు వెళ్తున్నారంటే.వాళ్ల కమిట్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్ధం చేసుకోండి.

ఉద్యోగమంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే అనుకున్న ఈనాటి జనాలు వారిని చూసి ఎంతైనా నేర్చుకోవాలి.అయితే దేశసేవను మించిన ఉద్యోగం ఇంకేముంటుంది అని భావించే యువకులు కూడా మనదగ్గర చాలామందే ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఆ గ్రామమంతా అలాంటి దేశభక్తులతోనే నిండిపోయింది.నిజామాబాద్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరి పేరు అడవి “మామిడిపల్లి“.

కేవలం 1500మంది జనాభా ఉండే ఆ ఊళ్లో యువతను చూస్తే దేశసేవ కోసమే పుట్టారా అనిపిస్తుంది.

Telugu Devotees, Latest, Mamidipalli, Nizamabad-Latest News - Telugu

ఎంత గొప్ప పనైనా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది.అక్కడ కూడా అంతే.చాలా ఏళ్ల క్రితం ఆ ఊరి నుంచి ఓ యువకుడు ఆర్మీలో చేరాడు.

అతడ్ని అందరూ ఆదర్శంగా తీసుకొని 16 ఏళ్లు రాగానే ప్రతి ఒక్కరూ ఆర్మీనే టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.ఆ ఒక్క ఊరి నుంచే ఇప్పటిదాకా 45మంది యువకులు సైన్యంలో చేరారు.

ఇప్పటికే ఆర్మీలో పనిచేస్తున్న యువకులు.తమ గ్రామంలో ఔత్సాహికులకు సపోర్ట్‌గా ఉంటారు.

ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ నుంచి రిటెన్‌ టెస్టుల దాకా.ఎలా ప్రిపేర్‌ అవ్వాలో నేర్పిస్తుంటారు.

దాంతో ఎప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరిగినా.అడవి మామిడిపల్లి యువకులు సెలెక్ట్‌ అవ్వాల్సిందే.

ఆదర్శవంతమైన గ్రామం కదూ!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube