పత్తి పంటను( Cotton crop ) తెల్ల బంగారం అంటారు.ఎందుకంటే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా పత్తి పంటకు మాత్రం ఏడాది పొడవు నా మంచి గిట్టుబాటు ధర ఉంటుంది.
కాబట్టి చాలామంది రైతులు ఏళ్ల తరబడి పత్తి పంటను సాగు చేస్తున్నారు.అయితే మొదట్లో వచ్చిన దిగుబడి రాను రాను తగ్గుతూ ఉండడంతో చాలామంది రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
అసలు కారణం ఏమిటంటే.పంట మార్పిడి చేయకుండా ఏళ్ల తరబడి పత్తి పంటను సాగు చేస్తే జింక్, మెగ్నీషియం ( Zinc, magnesium )వంటి సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడుతుందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు సూచిస్తున్నారు.
రైతులు నిర్లక్ష్యం చేయకుండా పత్తి పంటలో పోషకాల యాజమాన్య చర్యలు సకాలంలో చేపట్టితే మంచి దిగుబడి సాధించవచ్చు అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.ఆఖరి దుక్కిలో కచ్చితంగా సేంద్రియ ఎరువులను( Organic fertilizers ) వేసి కలియదున్నాలి.మొక్కల మధ్య, వరుసల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి.
ముఖ్యంగా తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.పత్తి పంటలో జింక్ లోపం: జింకు లోపం వల్ల పత్తి మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి.ఆకులు చిన్నవిగా ముడతలు పడి కనువుల మధ్య దూరం తగ్గుతుంది.దీంతో మొక్కలు గిడస బారి పోతాయి.
ఈ లోపాన్ని అధిగమించడం కోసం రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను ఒక లీడర్ నీటిలో కలిపి ప్రతి ఐదు రోజులకు ఒకసారి లాగా మూడుసార్లు పిచికారి చేయాలి.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎకరం భూమిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేసి కలియదున్నాలి.
పత్తి పంటలో మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల ముదురు ఆకు అంచులు పసుపు రంగులోకి మారి ఎర్రబడి రాలిపోతాయి.ఒక లీటర్ నీటిలో 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.