నాగబాబు కామెంట్లకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ..!!

నిన్న నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR సినిమా గురించి మాట్లాడుతూ కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే.ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావటం కోసం కేవలం ఫ్లైట్ టికెట్లకే.₹80 కోట్లు ఖర్చు చేశారు.అదే డబ్బు తనకి ఇస్తే ఎనిమిది నుంచి పది సినిమాలు తీస్తానని వ్యాఖ్యానించారు.దీంతో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.“నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు RRR కీ ఆస్కార్ కోసం” అంటూ “RRR మీద కామెంట్ కు వైసీపీ వారి భాషలో సమాధానం” అని… కామెంట్లు చేశారు.దీంతో నాగబాబు తనపై చేసిన కామెంట్లకు.తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

 Tammareddy Bharadwaja Gave A Reverse Counter To Nagababu's Comments ,tammareddy-TeluguStop.com

“నేను ఆ స్థాయిలో మాట్లాడగలను.కానీ నా తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారు.ఆస్కార్ కోసం ఖర్చు పెట్టే డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయవచ్చు అని మాత్రమే అన్నా.దీన్ని తప్పుగా చెబుతూ నీచంగా మాట్లాడుతున్నారు” అని తమ్మారెడ్డి ప్రతిస్పందించారు.అదేవిధంగా రెండు రోజుల క్రితం RRR గొప్పదనం గురించి మాట్లాడుతూ… రాజమౌళిని పొగుడుతూ వీడియో పోస్ట్ చేశాను.దాని గురించి మాట్లాడకుండా… మూడు గంటల వీడియోలో కేవలం ఆ రెండు నిమిషాల కామెంట్లు పరిధిలోకి తీసుకొని… తనపై ఈ రీతిగా కామెంట్ చేయడం మనసుకు బాధ కలిగించిందని ఫీలయ్యారు.

తనను తిట్టిన వారికి సిగ్గుండాలని అన్నారు.ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీద పడుతుందని నాగబాబు వ్యాఖ్యలకు తమ్మారెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube