కోలీవుడ్ మీడియాపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్.. రౌడీ స్టార్ ను అలాంటి ప్రశ్నలు వేయడంతో..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రజెంట్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఖుషి” (Khushi).ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది.

 Tamil Reporter Questioned Vijay Deverakonda Details, Vijay Devarakonda, Khushi M-TeluguStop.com

అందుకే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇదైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత (Samantha) హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.

విజయ్ కూడా వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.అయితే విజయ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ చేస్తుండగా ఈయనకు కాంట్రవర్సీ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కానీ ఈ ప్రశ్నలకు విజయ్ తెలివిగా వాటిని అడిగిన వారికే తిప్పికొడుతున్నారు.

Telugu Khushi, Khusi, Kollywood, Samantha, Tamil-Movie

మరి తాజాగా కోలీవుడ్ మీడియాతో( Kollywood Media ) ప్రెస్ మీట్ జరుగగా అక్కడ కూడా ఒక ప్రశ్న ఎదురయ్యింది, ఖుషి ఆలస్యానికి కారణం ఏంటని అడుగగా సమంత అనారోగ్యం అని చెప్పారు.సమంత అనారోగ్యానికి కారణం మీరేనా అంటూ ఆ విలేకరి మళ్ళీ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెప్పక ముందే లేడీ హోస్ట్ ఆ కన్వర్జేషన్ ను మార్చేసి పరిస్థితిని కంట్రోల్ చేసింది.

Telugu Khushi, Khusi, Kollywood, Samantha, Tamil-Movie

అంతకు ముందు కూడా మరో జర్నలిస్ట్ అక్కడి డైరెక్టర్లలో మీకు లోకేష్, వెట్రిమారన్ తప్ప మరొకరు తెలియదు కదా అని ప్రశ్నించగా విజయ్ అరుణ్ ప్రభును చాలా ఇష్టపడతాను ఇంతకు అతడు ఎవరో మీకు తెలుసా అంటూ కౌంటర్ వేయడంతో సదరు విలేకరి నోరు మూసేసాడు.మరి మీడియా విజయ్ ను టార్గెట్ చేసేలా ప్రశ్నలు అడగడంతో ఫ్యాన్స్ కోలీవుడ్ మీడియాపై ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube