భార్య ప్రాణాలు కాపాడుకోవాలని భర్త ఏం చేశాడో తెలుసా...?

కరోనా ప్రపంచంలోని ప్రజలందరిని ఇబ్బందుల్లో పడేసింది.ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెట్టింది.

 Tamil Nadu Man Cycles 130km With Wife To Give Her Cancer Treatment, Cancer, Pudu-TeluguStop.com

వైరస్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఇబ్బందులు తాళలేక, ఆకలికి తట్టుకోలేక, ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతూ.ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు.

పేదరికంతో కష్టాలు పడుతున్న ఓ వ్యక్తి భార్యకు క్యాన్సర్ వచ్చింది.ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ చర్యల్లో భాగంగా వయసు పైబడిన ఈ దంపతులు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు.

భార్యను కాపాడుకోవాలని వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయలేదు. లాక్ డౌన్ వల్ల బస్సులు లేకపోవడంతో భార్యను సైకిల్ పై ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

క్యాన్సర్ తో బాధ పడుతున్న భార్యను ఆస్పత్రిలో జాయిన్ చేయించినా ఫలితం లేకుండా పోయింది.

ఇక అసలు విషయంలోకి వెళితే… తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్ మేడుకు చెందిన అరివళగన్(60) రోజువారి కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో వివాహం చేసుకున్నాడు.వీరిద్దరి కుమారుడు విష్ణు(12).తొమ్మిది నెలల కిందట మంజులకు క్యాన్సర్ సోకిందని వైద్యులు తెలిపారు.ఆమె ఎడమ చెంపకు సమీపంలో క్యాన్సర్ వ్యాపించిందని తెలిసింది.

క్యాన్సర్ అని తేలిన మరుక్షణం నుంచి మంజులను అరివళగన్ పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రిలో చూపించేవాడు.మార్చి నెలలో లాక్ డౌన్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి మంజుల ఇంటికే పరిమితమైంది.

చికిత్స అందకపోవడంతో మంజుల ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది.తీవ్రమైన నొప్పితో బాధపడేది.

అది చూసి చలించిపోయిన అరివళగన్ మార్చి 29వ తేదీన పాత సైకిల్ పై భార్యను కూర్చో బెట్టుకొని కుంభకోణం నుంచి బయలుదేరాడు.అంత పెద్ద వయస్కుడు ఆయన తన భార్య సైకిల్ మీద కూర్చోబెట్టుకొని 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు.

చికిత్స అనంతరం అంబులెన్స్ లో ఇంటికి చేరుకున్నారు.భార్యపై చూపుతున్న ప్రేమను చూసి గ్రామస్థులు మెచ్చుకుని తోచిన సాయం చేశారు.

మంజుల ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకుంటోంది.కాగా ఆదివారం రాత్రి మంజుల చనిపోవడంతో అరివళగన్ కన్నీరుమున్నీరయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube