జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా పవన్ కళ్యాణ్ పై తమన్నా సింహాద్రి( Simhadri ) పోటీ చేయనున్నారు.గతంలో లోకేశ్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా ఈ ఎన్నికల్లో భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.
బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఈ మేరకు ప్రకటన చేయగా ఆ ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది.
చట్టసభల్లో ట్రాన్స్ జెండర్స్ కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కాలనే ఆలోచనతో తమన్నా సింహాద్రికి అవకాశం కల్పించామని రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav )అన్నారు.
తమన్నా సింహాద్రి స్వస్థలం విజయవాడ కాగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆమె పాపులారిటీని పెంచుకున్నారు.తమన్నా సింహాద్రి కొంతకాలం పాటు జనసేనలో కూడా పని చేశారు.
జనసేన నుంచి టికెట్ ఆశించిన తమన్నాకు టికెట్ దక్కలేదు.
కొంతకాలం క్రితం ట్రాన్స్ జెండర్ ( Transgender )కావడం వల్లే నాకు టికెట్ దక్కలేదని ఆమె చెప్పుకొచ్చారు.చంద్రబాబు బాగు కోసం పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్లందరినీ నాశనం చేశాడని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మాటలు మాత్రమే వింటున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.
పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటే పవన్ మాత్రం బాబును సీఎం చేయాలని కష్టపడుతున్నారని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.
పవన్ కూడా కోట్ల రూపాయలు తీసుకుని టికెట్లు ఇస్తే మాలాంటి వాళ్లకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె వెల్లడించడం గమనార్హం.తమన్నా సింహాద్రి పోటీ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది.ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.
ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రికి ఎన్నికల్లో ఎంతమంది నుంచి సపోర్ట్ దక్కుతుందో చూడాల్సి ఉంది.