పనిలో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎల్ పిఓ రాఘవరావు

నల్లగొండ జిల్లా: పనిలో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎల్ పిఓ రాఘవరావు అన్నారు శుక్రవారం నల్లగొండ జిల్లా, త్రిపురారం మండలం, అల్వాలపాడు అంజనపల్లి,లచ్యతండా గ్రామాల్లో ఎంపీఓ కోడి రెక్క రాజేంద్రకుమార్ తో కలిసి పర్యటించారు.

ఆయా గ్రామాలలోని నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు,క్రీడా ప్రాంగణాలు,క్రిమిటోర్యాలు,పాఠశాలలు,విద్యుత్ వ్యవస్థను ఆయన పరిశీలించారు.

గ్రామాలలో ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని,అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులదేనని, ప్రత్యేక అధికారుల సహాయంతో గ్రామంలోని అన్ని వసతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమాలలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామపంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు.

Strict Action Will Be Taken If Laxity In Work DL PO Raghava Rao, Strict Action ,

Latest Nalgonda News