వింత ఆచారం...నిప్పులపై డాన్స్ లు చేస్తూ స్వామికి మొక్కులు తీర్చే ఆచారం ఎక్కడో తెలుసా?

సాధారణంగా మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుడిని ఏదైనా కోరిక కోరి ఆ కోరిక నెరవేరిందంటే అప్పుడు స్వామివారికి ముడుపులు చెల్లించడం, ప్రత్యేక పూజలు చేయించడం, లేదంటే స్వామి వారికి ఏదైనా ఆభరణాలు చేయించడం చేస్తుంటాము.కానీ ఒడిస్సా రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.

 Strange Custom To Offer To The Lord By Dancing On Fires, Unique Ritual, Strange-TeluguStop.com

మయూర్ భంజ్ జిల్లాలో వరూన్ బ్లాక్ ప్రాంతంలో స్థానికులు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం….దాన్ని చూస్తున్న వారి కళ్లల్లో భయం పుట్టిస్తుంది.

ఇక్కడి ప్రజలు స్వామివారికి పూజలు చేయాలంటే ముళ్ళు కలిగిన నాగ జముడు మొక్కలపై పొర్లుదండాలు పెట్టీ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.అదేవిధంగా నిప్పులపై డాన్సులు చేస్తూ పండగలాగ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.

అలాగే కొరడాలతో బలంగా వీపులను బాదుకుంటూ ఎంతో సంతోషంగా స్వామివారికి నమస్కరించడం, మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ.ఒడిస్సాలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ ఇదే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.

ముఖ్యంగా దసరా వంటి పండుగ దినాలలో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఈ విధంగా మొక్కులు తీర్చు కోవడం జరుగుతుంది.మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.ఈ మూడు రోజులు భక్తులు స్వామివారికి ఈ విధమైనటువంటి మొక్కులు తీర్చుకుంటారు.అయితే ఈ విధంగా ముళ్ళ మొక్కలపై పొర్లుదండాలు పెట్టిన వారి శరీరానికి ఏమాత్రం గాయాలు తగలవు, నిప్పులపై నడిచిన వారికి ఏ మాత్రం నొప్పి తగలదు.

ఈ విధంగా వారికి ఏమీ కాకుండా వారిని ఆ దుర్గామాత కాపాడుతుందని అక్కడ భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.ముఖ్యంగా ఆ ప్రాంతంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు లేదా వర్షాలు పడని సమయంలో భక్తులు ఈ విధమైనటువంటి ఉత్సవాలను చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి వర్షాలు బాగా పడతాయని అక్కడి వారు విశ్వసిస్తారు.

అయితే ఈ విధమైనటువంటి ఆచారాలను ఇప్పటి వరకు అక్కడ ప్రజలు కొనసాగించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube